జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీ ఆన్ లైన్ రికార్డుల్లో ఇంటి యజమాని పేరు గల్లంతు విషయంపై ఈ నెల 8న మధ్యాహ్నం 2 గంటలకు స్థానిక ఎంపీవో కార్యాలయంలో మండల పంచాయతీ అధికారి అఫ్జల్ మియా విచారణ చేపట్టనున్నారు. ఈ మేరకు బుగ్గారం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పని చేసి పెగడపల్లి మండలం రాజారాంపల్లికి బదిలీ పై వెళ్ళిన పంచాయతీ కార్యదర్శి నరేందర్ కు నోటీసులు జారీ చేశారు.