జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో శనివారం మండల రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 131 వ జయంతి వేడుకలను నిర్వహించారు. నంది చౌరస్తా వద్ద గల చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూస్వాములు, రజాకార్ల అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిందన్నారు.