జగిత్యాల రూరల్ పరిధిలోని జాబితాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించి, పాఠశాల కీర్తిని దశదిశలా చాటింది. ఈ ఏడాది బాలికలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. మొగిలిపాల నవ్య 555 మార్కులతో ప్రథమ స్థానం, బి. లుదియా 545 మార్కులతో ద్వితీయ స్థానం, బి. స్పందన 534 మార్కులతో తృతీయ స్థానం సాధించారు. ఉపాధ్యాయుల ప్రత్యేక శిక్షణ, విద్యార్థుల పట్టుదల వల్లే ఈ విజయం సాధ్యమైందని ప్రధానోపాధ్యాయులు శేషశలపతి తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభపై గ్రామస్తులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.