గణపతి దర్శించుకున్న డీసీసీ జిల్లా అధ్యక్షులు గాజంగి నందయ్య

629చూసినవారు
గణపతి దర్శించుకున్న డీసీసీ జిల్లా అధ్యక్షులు గాజంగి నందయ్య
జగిత్యాల జిల్లాలోని ఇందిరమ్మ అర్బన్ కాలనీలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న గణపతి నవరాత్రి వేడుకలకు మంగళవారం డీసీసీ జిల్లా అధ్యక్షులు గాజంగి నందయ్య హాజరయ్యారు. ఆయన గణనాథుని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ రాష్ట్ర సెక్రటరీ ముఖేష్ కన్నా కూడా పాల్గొన్నారు. పద్మశాలి సేవా సంఘం సభ్యులు, కాలనీవాసులు, యువకులు, భక్తులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్