జగిత్యాల పట్టణంలో గణేష్ నిమజ్జనం తేదీల విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై గణేష్ ఉత్సవ సమితి, విశ్వహిందూ పరిషత్ స్పందించాయి. పట్టణంలోని గణేష్ మండప నిర్వాహకుల అభ్యర్థన మేరకు, అనంత చతుర్దశి అయిన సెప్టెంబర్ 23, 24, 25 తేదీలలో సాయంత్రం వరకు నిమజ్జన కార్యక్రమాలు చేసుకోవాలని విశ్వహిందూ పరిషత్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు బోయిని పద్మాకర్ కోరారు. ఈ సమావేశంలో వివిధ కుల సంఘాలు, ధార్మిక, రాజకీయ క్షేత్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.