జగిత్యాలలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

0చూసినవారు
జగిత్యాలలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ
జగిత్యాల అర్బన్, రూరల్ మండలాలకు చెందిన 100 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి కింద మంజూరైన రూ. 41.35 లక్షల విలువైన చెక్కులను జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజంగి నందయ్య గారు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఈ పంపిణీ జగిత్యాల మోతే రోడ్డులోని పార్టీ కార్యాలయంలో జరిగింది. నాయకులు మాట్లాడుతూ, ఎమ్మెల్యే చొరవతో జగిత్యాలకు అత్యధిక సీఎం సహాయ నిధి చెక్కులు మంజూరయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు న్యాయం చేస్తుందని, జగిత్యాలలో విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తూ, వైద్య సదుపాయాల విస్తరణకు ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్