రేచపల్లిలో రైతులకు సాదాబైనామా నోటీసులు పంపిణీ

387చూసినవారు
రేచపల్లిలో రైతులకు సాదాబైనామా నోటీసులు పంపిణీ
జగిత్యాల జిల్లా, సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామంలో 2020లో మీ సేవలో సాదా బైనామా ద్వారా దరఖాస్తు చేసుకున్న రైతులకు గ్రామ పంచాయతీలో నోటీసులు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్, రెవెన్యూ జీపీఓలు కలిసి రైతులకు ఈ నోటీసులను అందజేశారు. దరఖాస్తు చేసుకున్న రైతులు అవసరమైన పత్రాలను సమర్పించి తదుపరి ప్రక్రియలో పాల్గొనాలని అధికారులు సూచించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్