పోలియో రహిత సమాజానికి అందరూ సహకరించాలి: కౌన్సిలర్ శేఖర్

344చూసినవారు
పోలియో రహిత సమాజానికి అందరూ సహకరించాలి: కౌన్సిలర్ శేఖర్
జగిత్యాల జిల్లా, జగిత్యాల పట్టణంలోని 18వ వార్డులో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం 18వ వార్డు కౌన్సిలర్ శేఖర్ ప్రారంభించారు. పుట్టినప్పటి నుండి 5 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని, రెండు చుక్కలు జీవితానికి రక్షణ అని ఆయన తెలిపారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 19వ వార్డు కౌన్సిలర్ ఏనుగుల లావణ్య రాజేందర్, మేరీ సిస్టర్ రజిని, మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్