జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లి భీంరెడ్డి గూడెంలో దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. ధర్మపురి మండలం దోనూరుకు చెందిన రైతు సందు ధర్మయ్య (55) తన కూతురి ఇంటికి వచ్చి, అల్లుడు నరేష్‌తో కలిసి పొలానికి వెళ్లారు. అక్కడ వ్యవసాయ మోటారు ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ధర్మయ్య మంగళవారం అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద సమయంలోనూ మానవత్వాన్ని చాటుకుంటూ, మృతుడి కళ్లను కుటుంబసభ్యులు ఎల్వీపీఆర్ ఆస్పత్రికి దానం చేసి ఆదర్శంగా నిలిచారు.