ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి.. బీసీ చైతన్య సమితి

0చూసినవారు
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి.. బీసీ చైతన్య సమితి
జగిత్యాల జిల్లాలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని జాతీయ బీసీ చైతన్య సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు గురువారం వినతిపత్రం సమర్పించారు. బకాయిల కారణంగా పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమితి పేర్కొంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సాంబారి కళావతి, జిల్లా అధ్యక్షులు భోగ నాగభూషణం, జిల్లా అధ్యక్షురాలు చౌటపెల్లి స్వరూప, ప్రధాన కార్యదర్శి వావిలాల నాగరాజు, కార్యదర్శి ఆడెపు సత్యం, ఉపాధ్యక్షులు మానపురి రవి, సిరికొండ చంద్రయ్య, ధ్యావనపెల్లి రాజేందర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you