భారీ వృక్షం రోడ్డుపై కూలి భారీగా ట్రాఫిక్ జామ్

424చూసినవారు
భారీ వృక్షం రోడ్డుపై కూలి భారీగా ట్రాఫిక్ జామ్
జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామ సమీపంలోని జగిత్యాల–ధర్మారం ప్రధాన రహదారిపై భారీ వృక్షం అకస్మాత్తుగా కూలి రోడ్డుపై పడింది. దీంతో రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి, ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అకస్మాత్తుగా కురిసిన వర్షానికి తోడు ఈదురుగాలులు వీయడంతో జగిత్యాల నుంచి గొల్లపల్లి వెళ్లే మార్గంలో పలుచోట్ల చెట్లు రోడ్లపై కూలినట్లు సమాచారం. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రోడ్డుపై పడిన చెట్లను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. వర్షం, ఈదురుగాలుల నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్