జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తాను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని స్పష్టం చేశారు. బుధవారం జగిత్యాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, బీఆర్ఎస్ లో ఉన్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని తెలిపారు. దీని ఫలితంగానే గత రెండేళ్లలో జగిత్యాలకు రూ.650 కోట్ల నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. విప్ జారీ చేస్తే బీఆర్ఎస్ కే ఓటు వేస్తానని ఆయన అన్నారు.