జగిత్యాల జిల్లాలో వినూత్న హోలీ వేడుకలు

252చూసినవారు
జగిత్యాల జిల్లాలో వినూత్న హోలీ వేడుకలు
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్‌లో హోలీ పండుగను చిన్నారులు వినూత్నంగా జరుపుకున్నారు. శరీరాలపై రంగులు పూసుకుని గ్రామ వీధుల్లో సందడి చేసిన చిన్నారులు, చేతిలో UPI స్కానర్ పట్టుకుని డిజిటల్ విరాళాలు స్వీకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నగదుతో పాటు ఆన్‌లైన్ చెల్లింపులు కూడా స్వీకరించారు. సంప్రదాయం, సాంకేతికత కలయికతో పండుగ ఉత్సాహంగా, సంతోషంగా సాగింది.

సంబంధిత పోస్ట్