సిరిసిల్లలో అధికవడ్డీలతో సామాన్యులను వేధిస్తున్న నిర్వాహకులపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.1.39 కోట్ల నగదు, బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇది అక్రమ వ్యాపార తీవ్రతకు అద్దం పడుతుంది. గతంలో ఫైనాన్స్ వేధింపులు, చెల్లించలేని వడ్డీల కారణంగా జిల్లాలో పలువురు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లోనూ అక్రమ ఫైనాన్స్ ముఠాలపై కఠినచర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.