ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంగళవారం భానుడి ప్రతాపం 40 డిగ్రీలు దాటింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్ పూర్ లో 40.6 డిగ్రీలు, జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో 40.4 డిగ్రీలు, కరీంనగర్ జిల్లా గంగాధర్లో 39.7 డిగ్రీలు, సిరిసిల్ల జిల్లా పెద్దూరులో 38.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.