జగిత్యాల దేవిశ్రీ గార్డెన్స్ లో ఆదివారం కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర కళాశ్రీ ఉగాది పురస్కారాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రముఖ ఆధ్యాత్మిక పండితులు నంబి నర్సింహా చార్యులు కౌశిక్ మాట్లాడుతూ, కళలు, కళాకారులు భగవత్ స్వరూపంగా వెలుగొందుతారని, భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన ప్రముఖులకు కళాశ్రీ ఉగాది పురస్కారాలు ప్రదానం చేశారు.