జగిత్యాల: కౌమార బాలికలకు అవగాహన

0చూసినవారు
జగిత్యాల: కౌమార బాలికలకు అవగాహన
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా, బాలల భద్రత & డ్రగ్స్‌ వద్దని చెప్పండి కార్యక్రమాల కింద, టీనేజ్ గర్భధారణలు, ఎలోప్మెంట్ కేసులపై స్నేహ గ్రూపు కౌమార బాలికలకు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఐడిఒసిలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్. లత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో, యుక్తవయస్కులలో తొందరపాటు గర్భధారణ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, పోషకాహార లోపం, మానసిక ఒత్తిడి, తల్లి-శిశువు ఆరోగ్యంపై పడే ప్రతికూల ప్రభావాలపై వివరించారు.

సంబంధిత పోస్ట్