ఇబ్రహీంపట్నం మండలం బర్దిపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సంతానం కల్పిస్తానని దంపతులను నమ్మబలికి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు స్థానికంగా కలకలం సృష్టించాయి. నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం కోనసముద్రం గ్రామానికి చెందిన దంపతుల నుంచి రూ.80 వేలు తీసుకుని మోసం చేసినట్లు బాధితుడు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై అధికారిక విచారణ జరగాల్సి ఉండగా, వాస్తవాలను వెలికితీయాలని స్థానికులు కోరుతున్నారు.