గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో, బీర్పూర్ మండలంలో ఫ్లైయింగ్ స్కాడ్ బృందం విస్తృత తనిఖీలు చేపట్టింది. రేకులపల్లి చౌరస్తా వద్ద వాహనాలను ఆపి తనిఖీలు జరుగుతున్నాయి. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి సత్య ప్రసాద్ ఆదేశాల మేరకు, తహసీల్దార్ సుజాత సూచనల ప్రకారం ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు ఆర్ఐ శ్రీనివాస్ తెలిపారు.