జగిత్యాల: మున్సిపల్ కమిషనర్ పై మాజీ మంత్రి ఫైర్

0చూసినవారు
జగిత్యాల: మున్సిపల్ కమిషనర్ పై మాజీ మంత్రి ఫైర్
శుక్రవారం, మాజీ మంత్రి మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, జగిత్యాల మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్ తో ఫోన్ లో మాట్లాడారు. జగిత్యాల పట్టణంలో వెజ్ & నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు కోసం గత బిఆర్ఎస్ పార్టీ హయాంలో స్థలాన్ని సేకరించి, 6 కోట్లకు పైగా నిధులు వెచ్చించి షెడ్ల నిర్మాణం చేపట్టారని, అయితే ఇప్పటివరకు కాంట్రాక్టర్ ఆ సామాగ్రిని భద్రపరుచుకునేందుకు వాడుకుంటున్నారని, దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కమిషనర్ ఫోన్ ఇన్ కార్యక్రమం చేపట్టినట్లు పత్రికలలో చూశానని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్