జగిత్యాల: నేడు భారీ వర్షాలు!

2చూసినవారు
జగిత్యాల: నేడు భారీ వర్షాలు!
తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, ములుగు, భద్రాద్రి, మంచిర్యాల, జగిత్యాల, సూర్యాపేట, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వానలు పడే ఆస్కారముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షం పడే ఛాన్స్ ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఏపీలోని ఉత్తరాంధ్ర, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది.

సంబంధిత పోస్ట్