జగిత్యాల: జవహర్ లాల్ నెహ్రు 62 వ వర్దంతి

2చూసినవారు
జగిత్యాల: జవహర్ లాల్ నెహ్రు 62 వ వర్దంతి
కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి బోగోజీ ముకేష్ ఖన్నా ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలోని తహశీల్ చౌరస్తా వద్ద బుధవారం పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 62వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా డీసీసీ అధ్యక్షులు గాజెంగి నందయ్య నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ నిర్మాణంలో నెహ్రూ పాత్ర మరువలేనిదని, స్వాతంత్ర్యం అనంతరం ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయాయని ఈ సందర్భంగా వారు కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్