
రష్మికనే రానప్పుడు.. విజయ్ ఏం వస్తాడు: అల్లు అరవింద్ (వీడియో)
'ది గర్ల్‌ఫ్రెండ్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండను ఆహ్వానిస్తామని నిర్మాత అల్లు అరవింద్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ వేడుకను రద్దు చేస్తున్నట్టు బుధవారం నిర్వహించిన ప్రెస్మీట్లో తెలిపారు. ఎందుకని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘రష్మికే రానప్పుడు.. విజయ్ ఏం వస్తాడు?’ అని అన్నారు. "ఈ మూవీ హీరోయిన్ రష్మిక కనుక వేడుకకు విజయ్ను పిలిస్తే రిలవెంట్గా ఉంటుందని అనుకున్నాం. కానీ ఆమే లేనప్పుడు విజయ్ వస్తే ఏం బాగుంటుంది" అని చెప్పారు.




