జగిత్యాల: గురుకుల హాస్టల్ ఘటనపై స్పందించిన కవిత

0చూసినవారు
జగిత్యాల: గురుకుల హాస్టల్ ఘటనపై స్పందించిన కవిత
జగిత్యాలలోని ఎస్టీ సంక్షేమ హాస్టల్‌లో విద్యార్థులపై చీపురుతో దాడి జరిగిన ఘటనపై మాజీ ఎంపీ కవిత తీవ్రంగా స్పందించారు. ఇది అత్యంత దారుణమని, విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వంద మందికి పైగా విద్యార్థులు మరణించారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you