జగిత్యాల రూరల్ మండలం అనంతారం గ్రామానికి చెందిన గాదె రాజవ్వ మోకాలి శస్త్ర చికిత్సకు ఆర్థికంగా ఇబ్బంది పడుతుండగా, నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం రూ. 1 లక్ష 50 వేల విలువైన చెక్కును శుక్రవారం జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగన్న, గాదె రాజన్న, మోతే రాజన్న, ఏనుగుల రాజు తదితరులు పాల్గొన్నారు.