తెలంగాణ రాష్ట్ర మార్క్ ఫెడ్ కరీంనగర్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొలుగురి దామోదర్ రావు, నక్కల రవీందర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, గంగన్న, చెరుకు జాన్, బాల ముకుందం, లక్ష్మణ్ మల్లారెడ్డి, నారాయణ రెడ్డి, సత్తిరెడ్డి, చంద్ర రెడ్డి పాల్గొన్నారు.