జగిత్యాల జిల్లా కేంద్రంలోని పావని కంటి ఆసుపత్రిలో, రోటరీ క్లబ్ జగిత్యాల సహకారంతో, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ గురువారం జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 13 మంది నిరుపేదలకు ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేయించారు. అనంతరం వారికి ఉచిత కళ్ళద్దాలు, మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డా. విజయ్, ముప్పాళ్ళ రామచందర్ రావు, సురేందర్ రావు, శ్రీరామ్ భిక్షపతి, సునీల్, భోగ అరవింద్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.