జగిత్యాల: మే 15 న ఎంపీ అరవింద్ నిరాహార దీక్ష

0చూసినవారు
జగిత్యాల: మే 15 న ఎంపీ అరవింద్ నిరాహార దీక్ష
కేంద్రీయ విశ్వవిద్యాలయం జగిత్యాల నియోజకవర్గానికి కేటాయించినప్పటికీ, స్థానిక నాయకులు స్థలం కేటాయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి ఆరోపించారు. ఈ నేపథ్యంలో, మే 15న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జగిత్యాలలో నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. గురువారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ విషయాలు వెల్లడించారు. ఎమ్మెల్యే స్వలాభం కోసమే స్థలం కేటాయించడంలో ఆలస్యం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్