జగిత్యాల జిల్లా జనరల్ అబ్జర్వర్ జి. రమేష్, గ్రామ పంచాయతీ ఎన్నికల రెండవ విడత నామినేషన్ల స్వీకరణ జరుగుతున్న జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం, చల్ గల్ కేంద్రాలను మంగళవారం తనిఖీ చేశారు. నామినేషన్ల ప్రక్రియ తీరును, ఆన్లైన్ డేటా ఎంట్రీని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల రూరల్ ఎంపిడివో ఎన్. రమాదేవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.