జగిత్యాల: 50 వేల లోపు నగదు మాత్రమే అనుమతి

1చూసినవారు
జగిత్యాల: 50 వేల లోపు నగదు మాత్రమే అనుమతి
ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున, రూ. 50 వేల లోపు నగదు మాత్రమే అనుమతించబడుతుందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎన్నికల విధులకు సంబంధించిన ఫ్లయింగ్ స్కాడ్, ఎస్. ఎస్. టి, ఎఫ్. ఎస్. టి, జోనల్ అధికారులు, అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్సర్వర్లతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :