జగిత్యాల జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి తగిన చర్యలు చేపట్టాలని కోరుతూ ఎస్ఎల్ఎన్ రెసిడెన్సీ, శ్రీ లక్ష్మి గణేష్ అపార్ట్ మెంట్, వెంకన్న రెసిడెన్సీ, బిఎస్ రెసిడెన్సీ, లక్ష్మి నిలయం, ఎస్ఎల్ఎన్ ఎంక్లేవ్స్ వంటి కాలనీల వాసులు సీనియర్ న్యాయవాది నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి నేతృత్వంలో ఆదివారం ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో చెన్నమనేని సంతోష్ రావు కూడా పాల్గొన్నారు.