జగిత్యాల జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న 61 మంది ఈ-పంచాయతీ ఆపరేటర్లు, అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి గత 4 నెలలుగా వేతనాలు అందడం లేదు. దీంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సకాలంలో జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారమైందని, ఇల్లు గడవక అప్పులు చేయాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి బకాయి పడ్డ వేతనాలను తక్షణమే విడుదల చేయాలని వారు వేడుకుంటున్నారు.