జగిత్యాల: ప్రభుత్వాసుపత్రిలో ఎక్స్ రే ఫిల్మ్ ల కొరత

0చూసినవారు
జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో గత నెల రోజులుగా ఎక్స్ రే ఫిల్మ్ ల కొరత ఏర్పడింది. దీంతో ఎక్స్ రే తీసిన రిపోర్టులను టెక్నీషియన్లు రోగుల ఫోన్లకు పంపిస్తున్నారు. ఫోన్లు లేని నిరక్షరాస్యులు, వృద్ధులు, నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం రెడీయాలజీ సిబ్బందిని వివరణ కోరగా, ఫిల్మ్ ల కొరత వలన ఫోన్లలో రిపోర్టులు పంపిస్తున్నామని, ఎప్పటివరకు వస్తాయో తమకు తెలియదని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.

సంబంధిత పోస్ట్