జగిత్యాల పట్టణం ధరూర్ క్యాంపులోని వాల్మీకి ఆవాసంలో గ్రామీణ నిరుపేద విద్యార్థుల కోసం ప్రతి సంవత్సరం వేసవి సెలవుల అనంతరం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహిస్తున్నారు. ఈ వ్రతాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు పాల్గొంటారు. సమాజంలో ఐక్యత, సమరసత భావాలను పెంపొందించడం, సనాతన సాంప్రదాయాలను భావితరాలకు అందించడం ఈ కార్యక్రమాల లక్ష్యమని తెలిపారు.