జగిత్యాల: 15 రోజులైనా కొనుగోలు ప్రారంభించరా

3చూసినవారు
జగిత్యాల: 15 రోజులైనా కొనుగోలు ప్రారంభించరా
జగిత్యాల రూరల్ మండలం అనంతారం గ్రామ రైతులు కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి 20 రోజులు గడిచినా, కొనుగోలు కేంద్రం ప్రారంభించి 15 రోజులు అయినప్పటికీ ఇప్పటివరకు ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదని మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ విమర్శించారు. బుధవారం ఐకెపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఆమె, పంట చేతికొచ్చి 20 రోజులు, కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే 15 రోజుల కింద ప్రారంభించినా కొనుగోలు జరగకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆమె ఆరోపించారు.

ట్యాగ్స్ :