ప్రజా గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు బత్తుల నరేష్ మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయాల సాధనే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రబుద్ధ
భారత్ ఇంటర్నేషనల్, డిక్కీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం జరిగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్మరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిక్కీ జిల్లా కో ఆర్డినేటర్ నల్ల శ్యామ్, హరి అశోక్ కుమార్, అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు.