జగిత్యాల: ప్రజలందరి భాగస్వామ్యంతో పట్టణం అభివృద్ధి

2చూసినవారు
జగిత్యాల: ప్రజలందరి భాగస్వామ్యంతో పట్టణం అభివృద్ధి
జగిత్యాల పట్టణంలోని 14వ వార్డులో మంగళవారం 15 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, అడువాల జ్యోతి లక్ష్మణ్, తాజా మాజీ కౌన్సిలర్లు కూతురు పద్మ, బద్దం జగన్ మోహన్ రెడ్డి, రాజేష్ కోరే గంగమల్లు పాల్గొన్నారు. ప్రజలందరి భాగస్వామ్యంతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.