జగిత్యాల: రెండు అంగన్వాడి కేంద్రాలు ప్రారంభం

2చూసినవారు
జగిత్యాల: రెండు అంగన్వాడి కేంద్రాలు ప్రారంభం
మహిళ, పిల్లలు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీలో రెండు అంగన్వాడీ కేంద్రాలను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజా గౌడ్, జిల్లా సంక్షేమ అధికారి డా. నరేష్, సీడీపీవో మమత, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, అడువాల లక్ష్మణ్, చెట్పల్లి సుధాకర్, దుమాల రాజ్ కుమార్, కోరే గంగమల్లు, క్యాదసు నవీన్ పాల్గొన్నారు. ఈ కేంద్రాల ప్రారంభోత్సవం ద్వారా స్థానిక ప్రజలకు మెరుగైన సంక్షేమ సేవలు అందుతాయని భావిస్తున్నారు.