సేవా భారతి ఆధ్వర్యంలో నడుస్తున్న వాల్మీకి ఆవాస విద్యార్థులకు, జగిత్యాల పట్టణానికి చెందిన కాంట్రాక్టర్ తాటిపర్తి రాజేందర్ రెడ్డి-లావణ్య దంపతులు పాఠశాల యూనిఫాంలను అందజేశారు. అమెరికాలో ఉన్న వీరి కుమార్తె మార చరిష్మారెడ్డి-సచిన్ రెడ్డి దంపతుల కుమారుడు చి. వేద్విక్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా, ఆదివారం వాల్మీకి ఆవాసంలో 65 మంది విద్యార్థులకు సుమారు రూ. 50,000 విలువైన దుస్తులను అందించారు. ఈ కార్యక్రమంలో దాతలు, సేవా భారతి ప్రతినిధులు పాల్గొన్నారు.