జగిత్యాల అర్బన్ మండలం అంబారిపేటలో స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ మండల అధ్యక్షులు రాంరెడ్డి, దూరిశెట్టి మమత, బోగ రాజు కుమార్, ఊరేడి నవీన్, అది రఘు, గోనెల మహేష్ తదితరులు పాల్గొన్నారు.