జగిత్యాల: విజిలెన్స్ అధికారులు తనిఖీలు

0చూసినవారు
జగిత్యాల: విజిలెన్స్ అధికారులు తనిఖీలు
జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 60 మంది అధికారులు 8 గ్రూపులుగా ఏర్పడి పట్టణంలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేశారు. రెవెన్యూ, మున్సిపల్ కార్యాలయ సిబ్బందిపై ఇటీవల భవనాల అసెస్మెంట్లు, పన్ను విధింపుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈ తనిఖీలు చేపట్టారు. అధికారులు నేరుగా భవనాల వద్దకు వెళ్లి కొలతలు తీస్తూ అక్రమాలను గుర్తిస్తున్నారు.