జగిత్యాల: ఉరేసుకుని మహిళ ఆత్మహత్య!

530చూసినవారు
జగిత్యాల: ఉరేసుకుని మహిళ ఆత్మహత్య!
జగిత్యాలలోని అశోక్ నగర్ లో నివాసముండే కరబూజ గీతాంజలి (35) శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మల్యాల మండలానికి చెందిన గీతాంజలికి విద్యానగర్ కు చెందిన లక్ష్మణ్ తో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. రెండేళ్లుగా భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో గీతాంజలి తన కొడుకు, తల్లితో కలిసి అశోక్ నగర్ లో నివాసం ఉంటోంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. గీతాంజలి మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్