జగిత్యాల: ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి నివారణ దినోత్సవ ర్యాలీ

0చూసినవారు
జగిత్యాల: ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి నివారణ దినోత్సవ ర్యాలీ
ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని, సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఐడిఓసి కార్యాలయం నుంచి కొత్త బస్టాండ్ మీదుగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మెడికల్ కాలేజీలోని ఆడిటోరియంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సునీల్ కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా ఎయిడ్స్ పై ప్రజల్లో అవగాహన కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్