జగిత్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ బుధవారం కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ను ప్రారంభించారు. 5 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఏవైనా సమస్యలుంటే టోల్ ఫ్రీ నెంబర్ 9666234383 ను సంప్రదించాలని, 24 గంటల పాటు సిబ్బంది అందుబాటులో ఉంటారని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ఈ ఏర్పాటు చేశారు.