జగిత్యాలలో బీజేపీ నేత బోగ శ్రావణి నివాసంలో బీజేపీ కార్యకర్తలను పోలీసులు శనివారం హౌస్ అరెస్ట్ చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. గత రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి పోస్టర్లు అంటించి బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యేకు సవాలు విసిరారు. ఉదయం 11 గంటలకు తహసీల్ చౌరస్తా వద్ద చర్చకు రావాలని ఎమ్మెల్యేకు పిలుపు నిచ్చారు. ఈ తరుణంలో తహసీల్ చౌరస్తాకు వెళ్లేందుకు ప్రయత్నించిన కార్యకర్తలను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.