జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్: సీసీ రోడ్లకు రూ.50 లక్షల నిధుల ఆమోదం

0చూసినవారు
జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్: సీసీ రోడ్లకు రూ.50 లక్షల నిధుల ఆమోదం
జగిత్యాల పురపాలకశాఖ కార్యాలయంలో మంగళవారం మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ అధ్యక్షతన కౌన్సిల్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలోని వివిధ వార్డుల్లో సీసీ రోడ్ల ప్యాచ్‌వర్క్ పనులకు రూ. 50 లక్షల నిధులు కేటాయించాలని కౌన్సిల్ ఆమోదం తెలిపింది. బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా అవసరమైన ఏర్పాట్లు, ప్రజా సౌకర్యాలకు, మున్సిపల్ శానిటేషన్ వాహనాల మరమ్మతులకు రూ. 4 లక్షలు కేటాయించారు. షాపులను అద్దె లేదా లీజుకు ఇచ్చే ప్రక్రియను నిబంధనల ప్రకారం టెండర్ నిర్వహించాలని, మున్సిపాలిటీకి ఆదాయం సమకూరే విధంగా తదుపరి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.

సంబంధిత పోస్ట్