జగిత్యాల: జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే

1చూసినవారు
జగిత్యాల: జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే
ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రజల ఫిర్యాదులను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 14 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపై న్యాయంగా, పారదర్శకంగా విచారణ జరిపి బాధితులకు త్వరగా న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. చట్ట పరిధిలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.

ట్యాగ్స్ :