జగిత్యాల: గోమాతకు అంత్యక్రియలు చేసిన విహెచ్పి నాయకులు

0చూసినవారు
జగిత్యాల కొత్త బస్టాండ్ వద్ద బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒక లేగ దూడ మృతి చెందింది. ఈ ఘటనతో స్పందించిన స్థానిక విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గోమాతకు హిందూ సాంప్రదాయం ప్రకారం శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. గోమాతలకు హిందూ సంప్రదాయంలో విశిష్ట స్థానం ఉందని, సకల దేవతల నిలయంగా భావిస్తామని, మానవతా దృక్పథంతో తాము ఈ అంత్యక్రియలు నిర్వహించామని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సహకరించారు.
Job Suitcase

Jobs near you