
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. గన్నవరం-షార్జా విమానం ముంబైకి మళ్లింపు
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా గన్నవరం నుండి షార్జా వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని అధికారులు ముంబైకి మళ్లించారు. 175 మంది ప్రయాణికులతో మధ్యాహ్నం 12.30కి బయలుదేరిన ఈ విమానం, షార్జా విమానాశ్రయం మూసివేతతో తిరిగి గన్నవరం చేరుకుంది. దీంతో ప్రయాణికులు తమ స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. ఈ సంఘటన భారత అంతర్జాతీయ విమాన సర్వీసులకు అంతరాయం కలిగించింది.




