చంద్రగ్రహణం కారణంగా నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు అంజన్న టెంపుల్, ధర్మపురి నరసింహస్వామి దేవస్థానాలను మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. తెల్లవారుజామున ప్రాతఃకాల పూజలు ముగిసిన వెంటనే ఆలయ ద్వారాలను మూసివేస్తారు. వేములవాడ భీమన్న ఆలయంలో తిరిగి రాత్రి 7 గంటలకు పూజలు నిర్వహిస్తారు. కొండగట్టులో మార్చి 4వ తేదీన భక్తులకు దర్శనాలు కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.